A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పుల్లారావు 20 కోట్లు అడిగారు
Share |
February 25 2020, 11:41 am

వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సంచలన విషయం చెప్పారు. గుంటూరు జిల్లాలో తాను స్పైస్ బోర్డు ద్వారా ప్రజలకు ఉపయోగపడే సంస్థను ఏర్పాటు చేయబోతే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. ఆనాటి వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇరవై కోట్ల లంచం ఆశించారని అదికారులు చెప్పారని, అందుకు తాను ఒప్పుకోకపోతే అసలు స్పైస్ బోర్డే రాకుండా చేశారని ఆయన అన్నారు. ఈ విషయం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు వెళ్లిందని, ఆయన తాను పార్టీ మారితే అవకాశం ఇస్తామని అన్నారని ,అందుకు తాను ఒప్పుకోలేదని , దాంతో ఆయన అనుమతులు ఇవ్వలేదని ఆయన అన్నారు.ఈ ప్రాంతం అబివృద్దికి వారు చేసిన నిర్వాకమని ఆయన అన్నారు. ప్రస్తుతం గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత సచివాలయం ఎక్కడ ఉన్నా ఒకటే అని ఆయన అన్నారు. బొల్లాపల్లి వద్ద భారీ రిజర్వాయర్ కు ముఖ్యమంత్రి జగన్ ప్రణాళిక చేస్తున్నారని ,అది ఎంతో ఉపయోగమని అన్నారు. నరసరావుపేటలో జరిగిన బారీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు.

tags : brahmanaidu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info