A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో మాదిరి జరగరాదనే
Share |
February 24 2020, 1:54 am

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఆద్వర్యంలో ప్రశాంత పాలన సాగిస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకట రమణ రావు అన్నారు. నరసరావుపేటలో జరిగిన వికేంద్రీకరణ మద్దతు సభలో ఆయన ప్రసంగించారు. ఇందుకు మద్దతుగా నరసరావుపేటలో ప్రజలు పెద్ద ఎత్తున హాజరడం అబినందనీయమని ఆయన అన్నారు.వికేంద్రీకరణ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటూ చంద్రబాబు,ఆయన కుటుంబ సబ్యుల ప్రచారం చేస్తున్నారని ,ఇందుకోసం జోలె కూడా పట్టి రాద్దాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. గతంలో శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం వికేంద్రీకరణ ఆలోచనను జగన్ చేశారని అన్నారు. రాయలసీమ లో హైకోర్టు కోసం ఆందోళనలు జరిగాయని అన్నారు. ఉత్తారంద్ర వెనుకబడి ఉందని, ఒకే ప్రాంతంపై దృష్టి పెడుతున్నారని వారు బాద పడుతున్నారని , ఉత్తరాంద్రను విడగొట్టండని కూడా ఆందోళన చేశారని ఆయనఅ న్నారు. శ్రీకృష్ణ కమిటి, జిఎన్ రావు కమిటీ. బిఎస్టి నివేదికలు అన్ని పాలనా వికేంద్రీకరణ కు అనుకూలంగా సిఫారస్ లు చేశాయని ఆయన అన్నారు.ఎపిలో అసమానతలు తగ్గించాలని ప్రబుత్వం బావిస్తోందని అన్నారు. హైదరాబాద్ మాదిరి ఇక్కడ జరగరాదని ఆయన అన్నారు.చంద్రబాబు తనకు,తన కుటుంబానికి నష్టం వస్తుందనే ఆందోళనతోనే యాగీ చేస్తున్నారని ఆయన అన్నారు.

tags : mopidevi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info