A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి,జనసేన కూటమిపై చంద్రబాబు స్పందన
Share |
February 24 2020, 12:25 am

బిజెపి,జనసేన ల కూటమిగా ఏర్పడడం తప్పు కాదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తొలిసారిగా ఆయన దీనిపై స్పందించారు. అయితే ఆ కూటమి రాజదాని అమరావతిని తరలిపోకుండా అడ్డుకోవాలని ఆయన సూచించారు. భీమవరంలో ఆయన మాట్లాడారు.శివరామకృష్ణ కమిటీ రాజధాని ఏర్పాటుకు విజయవాడ, గుంటూరు జిల్లాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే 29 వేల మంది రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బోగస్‌ కమిటీల నివేదికలతో అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించడానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు.


శివరామకృష్ణ కమిటీ స్పష్టంగా గుంటూరు -విజయవాడ మద్య వద్దని చెబితే చంద్రబాబు ఏమిటో ఇలా మాట్లాడుతుంటారు!

tags : chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info