A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు
Share |
February 24 2020, 12:28 am

హైదరాబాద్ కు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 2020 సంవత్సరానికి గాను ప్రపంచంలోని 20 టాప్ నగరాలలో మొదటి స్థానంలో నిలిచిన రికార్డు పొందంది.
సామాజిక ఆర్థిక వ్యవస్థ, స్థిరాస్తి, వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు ప్రామాణికంగా 130 నగరాలను ఆయా విషయాలలో అద్యయనం చేసిన తర్వాత ఈ ర్యాంక్ ఇచ్చారు. జేఎల్ఎల్(జోన్స్ ల్యాంగ్ అనే సంస్థ జరిపిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినా దక్షిణాది నగరాలు అత్యుత్తమ పనితీరుతో ముందుకెళ్తున్నాయని తెలిపింది. వేగంగా పట్టణీకరణ, పర్యావరణ ఇబ్బందులు, అధిక రద్దీ, సామాజిక అసమానతలు, సొంతిళ్ల కొరత, భద్రత, అందరికీ అందుబాటులో సేవలు పెద్ద సవాళ్లుగా మారాయని అభిప్రాయపడింది.

tags : hyderabad

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info