A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారు
Share |
February 24 2020, 2:01 am

అదికార వికేంద్రీకరణ కు వ్యతిరేకంగా విష ప్రచారం జరుగుతోందని ప్రబుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నరసరావుపేటలో వికేంద్రీకరణకు మద్దతుగా జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి జగన్ ఈ ఏడు నెలల కాలంలో అనేక మంచి నిర్ణయాలు తీసుకుని ,రాస్ట్రాన్ని ఒక దశ,దిశతో ముందుకు తీసుకువెళుతున్నారని అన్నారు.ఈ అంశాలపై ప్రజలలో చర్జ జరుగుతుండడంతో దానిని పక్కదారి పట్టించడం కోసం ఐదారు గ్రామాలలో జరుగుతున్న ఆందోళనను రాష్ట్ర ఉద్యమంగా ఒక వర్గం మీడియా సృష్టిస్తోందని ఆయన అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా అదే దృష్టితో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.2014 లో ఒక ద్రోహం జరిగిందని, దాని పలితంగా రాష్ట్ర విభజన జరిగిందని అన్నారు. అయితే ఆ సంవత్సరం లో చంద్రబాబు కు చరిత్రాత్మక అవకాశం వచ్చిందని, కాని ఆయన దుర్వినియోగం చేశారని అన్నారు. అదే జగన్ 2104లో గెలిచి ఉంటే ఎపి ఎంతగానో అభివృద్ది జరిగి ఉండేదని ,అంత ప్రణాళితో జగన్ ఆనాటికే సిద్దంగా ఉన్నారని రామకృష్ణారెడ్డి అన్నారు. అదే సమయంలో అదికారం పొందిన చంద్రబాబు మొత్తం దుర్వినయోగం చేశారని, గ్రాఫిక్స్ తో ప్రజలను భ్రమలలో పెట్టడానికి ప్రాదాన్యత ఇచ్చారని అన్నారు. చంద్రబాబు చారిత్రక తప్పిదంగా అమరావతిని తయారు చేశారని అన్నారు. రాజదాని ప్రాంతం గా ఎంపిక అయిన ప్రదేశం సూటబుల్ గాదని ఎవరైనా చెబుతారని అన్నారు. తెలిసి కూడా చంద్రబాబు పాలన సాగించారని అన్నారు.తాత్కాలిక భవనాలతో సరిపెట్టరని అన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్నిమూడులక్షల ఇరవైవేల కోట్ల అప్పుల్లో పెట్టారని ఆయన అన్నారు.చంద్రబాబు చెప్పినట్లు రాజధానికి ఆ అప్పులో లక్ష కోట్లు పెట్టినా ఏమన్నా తయారయ్యేదేమోనని, కాని ఆయన ఆ పని చేయలేదని ఆయన అన్నారు.రాజదానిని సామాన్య, మద్య తరగతి ప్రజలకు వెసులుబాటు లేని విదంగా తయారు చేశారని అన్నారు. ఎకరం కోట్ల రూపాయలుగా చేశారని అన్నారు. మోడీతో శంకుస్థాపన ఒకచోట, తాత్కాలిక భవనం మరో చోట, శాశ్వత భవనాల శంకుస్థాపన మరో చోట చేశారని అన్నారు.ఇదంతా ఇన్ సైడ్ ట్రేడింగ్ కోసమే చేశారని అన్నారు. పద్నాలుగువేల మంది బయటవారు వచ్చి అక్కడ భూములు తీసుకున్నారని ఆయన అన్నారు.చంద్రబాబు తన భూముల విలువ పెరుగుతుందా?లేదా అన్నది చూశారే తప్ప రాజదాని వ్యయం తదితర విషయాలు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే శాశ్వత భవనాలు కట్టి ఉండేవాడని ఆయన అన్నారు.రాజధాని అన్నది ప్రజల సమస్య అవుతుందా? సచివాలయానికి వచ్చేవారిలో కాంట్రాక్టర్లే ఎక్కువ ఉంటున్నారని ,సామాన్యుడికి ఏమి అవసరం ఉంటుందని రామకృష్ణారెడ్డి అన్నారు.

tags : sajjala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info