A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనసేన సేవాదళ్ ను పటిష్టం చేస్తాం
Share |
February 24 2020, 12:55 am

బీజేపీతో పొత్తు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్రియాశీలక
కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయవలసిందిగా జనసేన పార్టీ అధ్యక్షులు
పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మంగళగిరిలోని జనసేన
పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ టి. శివశంకర్, శ్రీ
బొలిశెట్టి సత్య, పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బి. మహేందర్ రెడ్డి,
అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి. హరిప్రసాద్ లతో శ్రీ పవన్
కళ్యాణ్ సమావేశం అయ్యారు. గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో రానున్న
నాలుగు వారాలకు సంబంధించి పార్టీ కార్యక్రమాల ప్రణాళికను రూపొందించాలని
నిర్ణయించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ కోసం అహర్నిశలు
కష్టపడే వారితోపాటు తమ తమ వృత్తులు, ఉద్యోగాలు కొనసాగిస్తూ పార్టీ కోసం
కష్టపడే వారి జాబితాలు తయారు చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం
చేశారు. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలన్నారు.
బీజేపీతో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో
అనుసరించాల్సిన విధి విధానాలపై కార్యకర్తల సమావేశాల్లో చర్చిస్తారు. గత
కొన్ని సంవత్సరాలుగా పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలందరినీ
గుర్తించి వారిని ఆదరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జాతీయ, ప్రాంతీయ
ప్రాధాన్యత ఉన్న అంశాలు, పబ్లిక్ పాలసీస్, పార్టీ ఆలోచనా విధానం, వర్తమాన
రాజకీయ అంశాలపై ఎంపిక చేసిన కార్యకర్తలకు వర్క్ షాప్స్ నిర్వహించేందుకు
ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలను
దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాలను రూపొందించాలన్నారు. గత అసెంబ్లీ
ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన యువ అభ్యర్ధుల సమావేశాలను
కూడా ఏర్పాటు iచేయవలసిందిగా చెప్పారు. పార్టీలో ఉంటూ సామాజిక సేవ
చేయాలన్న తలంపు ఉన్నవారితో సేవాదళ్ ను పటిష్టంగా రూపొందించాలని
సూచించారు.

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info