A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు -రియల్ ఎస్టేట్-విజయసాయి వ్యాఖ్య
Share |
February 24 2020, 2:02 am

తమ పది లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ సంపద హుష్ కాకి అవుతుందని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయడు టెన్షన్ పడుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి ఎద్దేవ చేశారు. ఆయన ట్విటర్ లో కామెంట్లు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మనమంతా జాతీయ నాయకులను, సమున్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులను గౌరవిస్తాం. స్మరించుకుంటాం. చంద్రబాబుకు ఆ అలవాటే లేదు. ఆయన ఆరాధించేది ప్రపంచ కుబేరులైన బిల్ గేట్స్, వారెన్ బఫెట్, జెఫ్ బెజోస్ లాంటి వారినే. తనూ ఆ స్థాయికి ఎదగాలని అవినీతి మార్గాన్ని ఎంచుకున్నాడు.

10 లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ సంపద హుష్ కాకి అవుతుందనే టెన్షన్ ముందు సంక్రాంతి పండుగ ఎంత. డబ్బుంటే ప్రతి క్షణం ఉత్సవమే అనేది చంద్రబాబు, ఆయన వర్గీయుల ప్రగాఢ విశ్వాసం. ఈ లోగా ఇటు వాళ్లను అటు పంపిస్తాడు. తటస్థులను తెరపైకి తెస్తాడు. దేనికైనా సిద్ధమే విజనరీ! అని విజయసాయి వ్యాఖ్యానించారు.

tags : vijaysaireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info