A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ డిల్లీలోనే కాదు..గల్లీలోనూ లేదు
Share |
February 24 2020, 2:03 am

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోనే కాదు.. గల్లీలో కూడా లేదని తెలంగాణ ఆర్దిక మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అసలు ఆ పార్టీతో ఏమీ కాదని ,అలాంటిపార్టీ నేతలు చెప్పే మాటలు నమ్మి ప్రజలు మోసపోరాదని ఆయన అన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు ప్రసంగించారు. ‘టీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేస్తుంది. కేసీఆర్ కిట్లు ,కళ్యాణ లక్ష్మీ , షాది ముబారక్ ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాయ మాటలు నమ్మవద్దు. సంగరెడ్డి మున్సిపాలిటీ లో రూ. 35 కోట్ల తో అభివృద్ధి చేశాం. సంగారెడ్డి అభివృద్ధి బాధ్యత నాది. సంగారెడ్డి మున్సిపాలిటీ ని దత్తత తీసుకొని సమగ్ర అభివృద్ధి చేస్తాను.అని ఆయన భరోసా ఇచ్చారు.

tags : harishrao

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info