A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
3 రాజధానుల ప్రతిపాదన -గుడ్ అన్న కెసిఆర్
Share |
January 26 2020, 9:23 pm

ఎపి ముఖ్యమంత్రి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సమర్దించారని మీడియాలో కధనాలు వచ్చాయి. అది మంచి నిర్ణయమని ఆయన అబిప్రాయపడ్డారని ఆ కదనాలు చెబుతున్నాయి.కెసిఆర్,జగన్ ల భేటీలో ఆ అంశం ప్రస్తావనకు వచ్చింది.అభివృద్ధి వికేంద్రీకరణతో ఇప్పటికిప్పుడు కాకపోయినా దీర్ఘకాలంలో సత్ఫలితాలు వస్తాయని కెసిఆర్ అన్నారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి మొత్తం హైదరాబాద్‌లో కేంద్రీకృతం కావడం రాష్ట్ర విభజన ఆలస్యానికి ప్రధాన కారణమైంది. అప్పట్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు కూడా హైదరాబాద్‌ స్థాయిలో కొంతైనా అభివృద్ధి చెంది ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో వచ్చేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలు, మండలాలు, మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ద్వారా అధికార వికేంద్రీకరణ చేశామని తెలిపారు. దీంతో, సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. అలాగే, తెలంగాణలో ద్వితీయ శ్రేణి నగరాలుగా ఉన్న వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ వంటి పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు చెప్పారుని సమాచారం.

tags : kcr,capital

Latest News
*బాబు కు ర్యాంకు ఇవ్వనంటున్న విజయసాయి
*అసెంబ్లీకి సమావేశాలకు టిడిపి దూరం
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*6గురు ఎమ్మెల్సీలు టిడిఎప్పి భేటీకి దూరం
*చంద్రబాబు చీకటి, జగన్ వెలుతురు
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info