A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈనాడు, ఆంద్రజ్యోతి ఎందుకు ఉద్యమం!
Share |
July 7 2020, 4:51 pm

రాజదానిగా అమరావతిని యధాతదంగా కొనసాగించాలని , అక్కడే అన్నిటిని ఏర్పాటు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీతో పాటు ఈనాడు, ఆంద్రజ్యోతి పత్రికలు ఉద్యమం నిర్వహిస్తున్నాయి. రాజకీయ పార్టీగా చంద్రబాబు కు ఒక అబిప్రాయం ఉండడం తప్పు కాదు. కాని పత్రికలు గతంలో ఏమి రాశాము? ఇప్పుడు ఏమి రాస్తున్నాము అన్నదానితో నిమిత్తం లేకుండా ప్రజలను ప్రభావితం చేయడానికి ఆ రెండు పత్రికలు విపరీతంగా కష్టపడుతున్నాయి.ఇందులో వారికి ఎలాంటి ప్రయోజనం ఉన్నదో తెలియదు కాని ఉదయం లేచిన దగ్గర నుంచి రాజదాని గ్రామాలలో కనపడిన ప్రతి ఒక్కరితో, లేదా నిరసన శిబిరాలలో కూర్చున్న ప్రతి ఒక్కరి ముందు ఈటివి,జ్యోతి మైకులు పెట్టి వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్ ను నానా తిట్లు తిట్టిస్తున్నారు. వీరు తెలుగుదేశం పత్రికలుగా ముద్రపడవద్దనుకుంటే ఏమి చేసేవారు? వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అనండి,ప్రభుత్వంలోని వారనండి ..వారు చేస్తున్న వాదనలను కూడా ఎంతో కొంత ప్రచారం చేసేవారు. ప్రభుత్వంలోని వారు మాట్లాడుతున్నా వారికి కవరేజీ ఇవ్వకపోగా, జగన్ ను దూషించే వారికే ప్రాధాన్యం ఇస్తు ఎక్కువ సార్లు టీవీ ప్రసారాలు చేస్తున్నారు. పాలన వికేంద్రీకరణ కు అనుకూలంగా మాట్లాడేవారి వ్యాఖ్యలను ప్రచురించకుండా, చంద్రబాబు చేష్టలను విమర్శించే విషయాలను ఒక్క మాట రాయకుండా,టీవీలలో చూపకుండా ,అచ్చంగా టిడిపి తరపున పనిచేస్తున్నారు.అందువల్లే వాటిని టిడిపి చానళ్లుగా , పత్రికలుగా ప్రజలు చూసే పరిస్తితి ఏర్పడింది. నిజంగానే ఆ పత్రికలు స్వతంత్రంగా ఉండదలిస్తే రెండువైపు వాదనలు రాయవచ్చు. తప్పు లేదు. కాని వారికి ఏదో అధిక స్వార్ద ప్రయోజనం ఉండి ఉండాలి. అది ఏ స్థాయిలో ఉందంటే ప్రధాని మోడీ ఆశిస్సులతో కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద బిరుదు పొందినా, రామోజీరావు ప్రేమ అనండి.మరొకటి అనండి అంతా చంద్రబాబుపైనే అనుకోవాలి. ఎందుకంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు తెలంగాణ లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే దానికి మద్దతు ఇస్తూ ఈ పత్రికలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అలాగే ధర్మపోరాట దీక్షలని,మరొకటని వందల కోట్ల రూపాయల ప్రజల దనంతో చంద్రబాబు వృదా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ఎక్కడా ఒక్క సారి కూడా ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నించలేదు. పైగా పూర్తిగా మద్దతు ఇస్తూ టీవీలలో ప్రసారం చేశారు. పత్రికలలో ప్రచారం చేశారు. మోడీని బండబూతులు తిట్టినా తప్పు పట్టలేదు. ప్రత్యేక హోదా పై చంద్రబాబు అన్ని మాటలు మార్చినా ఒక్కసారి కూడా అదేమిటని ఈ పత్రికలు అడగలేదు. ఇప్పుడు కూడా నిత్యం చంద్రబాబు భజన చేస్తూ ఆయన ఏమి చేస్తేదానికి వంత పాడుతున్న తీరు చూస్తే , చంద్రబాబు కన్నా ఈ రెండు పత్రికలకే అమరావతి గ్రామాలలో అదిక ప్రయోజనం ఉండి ఉండాలన్న భావన కలుగుతుంది. నిజానికి ఈనాడుకు జీవితాన్ని ఇచ్చింది. రామోజీరావుకు గుర్తింపు ఇచ్చింది విశాఖపట్నం.ఈనాడు మొదట అక్కడే ఆరంబం అయింది.అయినా విశాఖలో కార్యనిర్వాహక రాజధాని అవుతుందంటే ఈనాడు ఇష్టపడడం లేదు. పూర్తిగా వ్యతిరేకంగా వాళ్లను,వీళ్లను బతిమలాడి వ్యాసాలు రాయిస్తోంది. అన్ని ప్రాంతాలలో కూడా ఈనాడు కు సర్కులేషన్ ఉంటుంది. టీవీలు చూస్తారు.అయినా ఆ రెండు మీడియా సంస్థలు, మరో ఒకటి,రెండు సంస్థలు రాయలసీమ, ఉత్తరాంద్రలలో నష్టపోయినా పర్వాలేదు..మాకు మాత్రం అమరావతే కావాలి..అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయంటే అయితే వారికి ఏదైనా స్వార్దం ఉండాలి.లేదా ఇలాగైతే తెలుగుదేశం పార్టీకి మళ్లీ ప్రజలలో ఆదరణ పెరుగుతుందని భావిస్తుండాలి.చంద్రబాబు మళ్లీ అదికారంలోకి రావడానికి ఇది ఉపయోగపడుతుందని నమ్ముతుండాలి. ఈ క్రమంలోనే ఈనాడు ఒక పుల్ పేజీ కధనాలు వండి వార్చింది. రాజధాని అమరావతిలో అన్ని నిర్మాణాలు దాదాపు పూర్తి అయిపోయాయని, విశాఖ వెళితే బారం అని ప్రచారం చేయడం కోసం ఈ పత్రిక ఈ కధనాలు ఇచ్చింది. సంతోషమే. ఈ విషయాన్ని గతంలో ఎందుకు చెప్పలేదు. ప్రధాని మోడీని చంద్రబాబు దూషిస్తుంటే ,రాజధానికి అసలు డబ్బులు ఇవ్వలేదని అంటుంటే, ఎందుకు తప్పు పట్టలేదు?మరి అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వంటివాటిని చంద్రబాబు శాశ్వత భవనాలుగా నిర్మించారా? ఆ విషయం ఎందుకు చెప్పలేదు? అదే నిజమైతే చంద్రబాబు అనేక శంకుస్థాపనల పరంపర కొనసాగిస్తున్నప్పుడు ఎందుకు డబ్బు వృదా చేస్తున్నావని అడగలేదు.పైగా వంద అడుగుల లోతున పునాది తీసి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే అదేదో గొప్ప టెక్నాలజీ చంద్రబాబే కనిపెట్టినట్లు ప్రచారం చేశారే. ఏభై అంతస్థుల టవర్లు నిర్మిస్తున్నామని చంద్రబాబు శంకుస్థాపన చేసినప్పుడు అన్ని వేల కోట్ల ప్రజల డబ్బు వేస్ట్ చేస్తున్నావని ఎన్నడైనా ఈనాడు, ఆంద్రజ్యోతి అడిగాయా? లేదే?పైగా అహో,ఓహో అంటూ బజన చేశాయే?అన్ని భవనాలు సిద్దంగా ఉంటే ఏభై రెండువేల కోట్ల విలువైన పనులకు డబ్బు లేకపోయినా చంద్రబాబు టెండర్లు పిలస్తే ఎన్నడైనా ఈ రెండు పత్రికలు ప్రశ్నించాయా?ఇప్పుడు మాత్రం అసలు రాజధాని అమరావతి అన్ని వడ్డించిన విస్తరి అని చెబుతున్నారే..మరి అవే టీవీలు, అవే పత్రికలు చంద్రబాబు అమరావతిలో టూర్ చేస్తూ అది కట్టడం లేదు..ఇది కట్టడం లేదూ..అంటూ ప్రచారం చేస్తున్నప్పుడు ఇంకా కట్టడాల అవసరం ఏమిటని ప్రశ్నించలేదే. లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆయా మౌలిక సదుపాయాలకు కల్పించాలని చంద్రబాబు కోరినప్పుడు అంత ఎందుకు అని ప్రశ్నిచలేదే? ఇంత మొత్తం తాము ఖర్చు చేయలేమని, ఇదంతా రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, స్కాముల పుట్టగా మారిందని జగన్ ప్రభుత్వం చెబుతుంటే మాత్రం ఈ పత్రికలు ఎందుకు అంగీకరించలేకపోతున్నాయి?శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని ఒక చోట ఉంటే, హైకోర్టు మరో చోట ఉండాలన్న సూత్రం ఈనాడు, ఆంద్రజ్యోతికి తెలియదా? రామోజీరావుకు ఈ విషయాల మీద అవగాహన లేదంటే నమ్మగలమా? అయినా పర్వాలేదు. మనం కోరుకున్నచోటే అన్ని ఉండాలి. మిగిలినవాళ్ల ఆకాంక్షలు ఏమైనా పర్వాలేదని వీరు అనుకున్నారా? రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే ముఖ్యమని అనుకున్నారా? లేక ముఖ్యమంత్రి జగన్ అంటే ఉన్న ద్వేషం ఈ స్థాయికి చేరిందా?చంద్రబాబు అయితే తాము ఏది చెబితే అది చేస్తారు..జగన్ అయితే తమ ఇష్టం వచ్చినట్లు చేసుకోవడానికి కుదరదన్న భావనా? గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు వారానికి ఒక రోజు రామోజీరావు వద్దకు వెళ్లి కూర్చుని ఆయన నుంచి సలహాలో, ఆదేశాలో తీసుకునేవారని అంటారు. అప్పటి నుంచే రాజగురుగా రామోజీ పేరొందారు. ఇప్పుడు ఆ హోదా పోయిందన్న బాధ అనుకోవాలా? ఏది ఏమైనా ఒకప్పుడు జర్నలిజం విలువలు అని ప్రచారం చేసిన రామోజీరావు ఇప్పుడు వాటిని వదలివేసి,ఏకపక్షంగా కదనాలు ఇస్తున్న తీరు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమి జరిగినా, రణరంగం అంటూ ప్రచారం చేస్తున్న తీరు మాత్రం బాద కలిగిస్తుంది. ఈనాడు, ఆంద్రజ్యోతి ఇలా ఎంతకాలం జగన్ ప్రభుత్వం పై విషం చిమ్ముతాయో చూడాలి.రు.

tags : eenadu, jyothi,movement

Latest News
*16238 కరోనా పరీక్షలు-1178 పాజిటివ్-ఎపి
*సచివాలయం అంత అర్జంట్ గా కూల్చాలా
*టిడిపి అడ్డుపడడంపై జగన్ విచారం
*చంద్రబాబు-రాక్షసులు- యజ్ఞం- బొత్స వ్యాఖ్య
*పోలవరం లో గడ్డర్ల ఏర్పాటు ఆరంభం
*మేం కట్టించిన ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*సబ్బం హరి ఉత్తరాంద్ర ద్రోహి
*టి. లో బాద్యతలనుంచి తప్పుకుంటున్న డాక్టర్ లు
*నగరం వీడి వెళ్లవద్దు-మంత్రి విజ్ఞప్తి
*ఎపిలో స్కూళ్ల కు రంగులు- జాగ్రత్త సుమా
*శానిటరీ సిబ్బందికి పిపిఈ కిట్స్ ఇచ్చారు
*సీజనల్ వ్యాధులతో జాగ్రత్త- ఆరోగ్య మంత్రి
*టి.బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి
*చేతి వృత్తులకు వైభవం తెచ్చిన కెసిఆర్
*ముఖ్యమంత్రి ఆఫీస్ మెడక్ బంగారం స్మగ్లింగ్ కేసు
*అడిగి మరీ రాజమండ్రి జైలుకు టిడిపి మాజీ మంత్రి
*ఇళ్ల స్థలాలు- చంద్రబాబు సైంధవ పాత్ర
*గవర్నర్ తమిళపై మరో అడుగు వేశారు..
*ఆన్ లైన్ క్లాస్ లైతే వీసాలకు అమెరికా నో
*కెసిఆర్ అనుకున్న పని చేస్తున్నారు
*గవర్నర్ తమిళసైకి, సర్కార్ కు బెడిసిందా
*సగం ఆర్టిసి బస్ లు కూడా తిరగడం లేదు..
*అయ్యన్న కౌరవ సభలో మాట్లాడినట్లుగా..
*ఓట్ల చీలిక పాచిక- ట్రంప్ కు కలిసి వస్తుందా
*నేరాలకు కులాలు,మతాలు ఉండవు
* సంక్షేమ షెడ్యూల్ ఇచ్చిన సి.ఎమ్.ను చూశామా
*మూడు రోజుల్లో మూసికి కొత్తగేట్లు
*తెలంగాణలో కరోనా - బాలల పరిస్తితి
*తెలంగాణలో 197 మంది జర్నలిస్టులకు కరోనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info