A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇంకో సారి చేస్తే చేతులు ముడుచుకోం- పవన్ కళ్యాణ్
Share |
January 26 2020, 2:55 pm

వైసిపి ప్రతినిదులు అకారణంగా గొడవలు చేసి, ఇలాంటి అద్వాన్నంగా భాష మాట్లాడతారా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.కాకినాడలో ఆయన మాట్లాడారు. సభ్య సమాజంలో ప్రజా ప్రతినిదిగాఉండి ఉపయోగించకూడని భాష ఉపయోగిస్తున్న తీరు అభ్యంతరకరమని ఆయన అన్నారు. అందుకు నిరసనగా జనసేన కార్యకర్తలు ఆందోళన చేస్తే దానిపై వైసిపి కార్యకర్తలు వ్యవహరించిన వైనం పద్దతిగా లేదని అన్నారు. వాళ్లు తిడితే తమ వాళ్లపై కేసులు పెడతారా అని ఆయన అన్నారు.పోలీసు లు చోద్యం చూసినట్లు వ్యవహరించడం బాగోలేదని అన్నారు. మా సహనం చేతకాని తనం కాదని అన్నారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించాలనుకుంటే మీరు ఎవరూ ఇక్కడ ఉండలేరని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అమరాతి రైతుల కోసం ప్రదర్శన చేద్దామనుకుంటే అసాంఘీక శక్తులు వస్తాయని పోలీసులు చెప్పారని ,అంటే మాకు నిరసన కు హక్కు లేదా అని ఆయన అన్నారు. వైసిపి అదికారంలోకి వస్తే పాలెగాళ్ల రాజ్యం వస్తుందని అన్నామని ,అదే జరిగిందని అన్నారు. పచ్చిబూతులు తిట్టి, కారణం లేకుండా దాడులు చేస్తే పోలీసులు చూస్తూ కూర్చోవడం క్షమించరానిదని ఆయన అన్నారు. కారకులపై సుమోటో చర్య తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేపై పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.ఎమ్మెల్యే దిగి వచ్చారనుకుంటున్నారా అని ఆయన అన్నారు.ఇంకా నియంత్రణలోనే ఉన్నామని, పోలీసు శాఖ కాని, ఉన్నతాదికారులకు కాని ,ఇంకొక్క సంఘటన జరిగితే ,మా వాళ్ల పై చేస్తే..నేను చేతులు ముడుచుకుని కూర్చోనని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.తాము బాద్యత గా రాజకీయాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

tags : pawankalyan,

Latest News
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*చంద్రబాబు చీకటి, జగన్ వెలుతురు
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info