A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఓడిపోయాడు కనుక పవన్ కళ్యాణ్ కు ద్వేషం
Share |
January 26 2020, 1:29 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని చోడవరం వైసిపి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. జేఏసీ ముసుగులో చంద్రబాబు టీడీపీ నేతలతో ఉద్యమం చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయంగా బాబుకు పోయేకాలం దగ్గరపడిందన్నారు. జోలె పడితే జాలి వస్తుందని విన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అంటే బాబుకు ఎందుకంత కడుపు మంటని నిలదీశారు. చంద్రబాబు ఒక ఉన్మాదిలా ఉత్తరాంధ్రపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో బినామీ భూములు లేవని రాజధానిని వ్యతిరేకిస్తున్నారా? అని ఆయన అన్నారు.
‘వైజాగ్‌ రాజధాని అయితే రాష్ట్రానికి ఆదాయంతో పాటు యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ముంబైతో సమానంగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. రాయలసీమలో హైకోర్టు పెడితే నాలుగు జిరాక్స్ మిషన్లు వస్తాయని రాయలసీమ ప్రాంతాన్ని అవమాన పరుస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాజువాకలో ఓడిపోయాడు కాబట్టి ఉత్తరాంద్రపై విద్వేషం చూపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వేర్వేరు కాదు. ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు

tags : avnti

Latest News
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info