A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సి.ఎమ్. గా పోలీసులకు బాబు నీళ్లు కూడా ఇవ్వలేదా
Share |
January 26 2020, 7:36 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలను ఎపి పోలీసు అదికారుల సంఘం ఖండించింది. చంద్రబాబు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని డీజీపీకి, పోలీసు శాఖకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎండీ మస్తాన్‌ఖాన్, కోశాధికారి ఎం.సోమశేఖర్‌లుఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారనే విషయం గత ఐదేళ్లు పరిపాలించిన చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు.


డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో నీతినిజాయతీగా పనిచేసే అధికారిగా పేరుందని, అలాంటివ్యక్తిపై చంద్రబాబు విమర్శలు చేయడం ఎంతవరకు సబబని నిలదీశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా అఖిల భారత సర్వీసు అధికారుల సేవల్ని ఉపయోగించుకుని ఇప్పుడిలా వేరు చేసి మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు. రాజ్యాంగబద్ధంగా నియమితులైన డీజీపీకి ప్రాంతీయభేదం ఆపాదించి దక్షిణ భారతం, ఉత్తర భారతం అంటూ చంద్రబాబు మాట్లాడటం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని తప్పుపట్టారు. పోలీసు శాఖలో చంద్రబాబు చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారని, మాలో మాకు విద్వేషాలు సృష్టించి దాని ద్వారా లాభాన్ని ఆశిస్తున్నట్టుగా చంద్రబాబు తీరు ఉందని వారు ఆక్షేపించారు.

మీ భద్రతకోసం ఉన్న పోలీసులకు మంచినీళ్లూ ఇవ్వని ఘనత మీది..
మీ భద్రతకోసం విధుల్లో ఉన్న పోలీసులకు కనీసం మంచినీళ్లు ఇవ్వని ఘనత మీదని, మీకు పోలీసులను విమర్శించే నైతిక అర్హత లేదని వారు వ్యాఖ్యానించారు. పోలీస్‌ అధినేతనే టార్గెట్‌ చేసి విమర్శలు చేయడం ద్వారా యావత్తు పోలీసు వ్యవస్థను నిర్వీర్యంచేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్న చంద్రబాబు ఆలోచన రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ఎక్కడ శాంతిభద్రతలు బాగుంటాయో అక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పదేపదే చెప్పే మీరు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని వారు ఆ ప్రకటనలో తెలిపారు.

tags : babu,police

Latest News
*బాబు కు ర్యాంకు ఇవ్వనంటున్న విజయసాయి
*అసెంబ్లీకి సమావేశాలకు టిడిపి దూరం
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*6గురు ఎమ్మెల్సీలు టిడిఎప్పి భేటీకి దూరం
*చంద్రబాబు చీకటి, జగన్ వెలుతురు
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info