A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు అమరావతికే నాయకుడా
Share |
July 7 2020, 6:01 pm

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈ నెల 13న అనంతపురం జిల్లాలో బస్సుయాత్ర చేస్తాననటం హాస్యాస్పదమని వైఎస్సార్‌ సీపీ అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. అధికార వికేంద్రీకరణపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వతే రాయలసీమలో పర్యటించాలని సవాల్‌ విసిరారు. అనంతవెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందింది. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ కోసమే సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగాయి. ఇప్పుడు అలాంటి తప్పులు పునరావృతం కాకూడదు. అధికార వికేంద్రీకరణ దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో కూడా చంద్రబాబు ఇంతలా గగ్గోలు పెట్టలేదు. టీడీపీ స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ఏపీ సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారు. రాయలసీమ పర్యటనకు వస్తున్న చంద్రబాబును ప్రజలు ప్రశ్నించాలి. స్పష్టమైన సమాధానం చెప్పిన తర్వాతే చంద్రబాబు అనంతపురంలో పర్యటించాలి. అమరావతిలో పోరాటం చేస్తున్నది రైతులు కాదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులే. కర్నూలులో హైకోర్టు పెట్టాలా? వద్దా?.. విశాఖలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెట్టాలా? వద్దా?.. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉండాలా? వద్దా?..

అమరావతి కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారా?..మిగిలిన ప్రాంతాల అభివృద్ధి చంద్రబాబుకు అక్కర్లేదా?.. రాయలసీమలో రైతుల ఆత్మహత్యలు జరిగినప్పుడు చంద్రబాబు భిక్షాటన ఎందుకు చేయలేదు?.. సీమ నుంచి రైతులు, వ్యవసాయ కూలీలు వలసలు వెళ్లినప్పుడు చంద్రబాబు ఎందుకు స్పందించలేదు?.. శ్రీభాగ్ ఒప్పందం అమలుపై చంద్రబాబు వైఖరి ఏంటి?.. టీడీపీ అమరావతికే పరిమితమా?.. చంద్రబాబు అమరావతికి మాత్రమే నాయకుడా?.. చంద్రబాబుకు ఏపీ ప్రయోజనాల కన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారమే ముఖ్యమా?’ అని ప్రశ్నించారు.

tags : ananta

Latest News
*ఎపిలో కరోనా బాదితులకు భోజనానికి రూ.500
*16238 కరోనా పరీక్షలు-1178 పాజిటివ్-ఎపి
*సచివాలయం అంత అర్జంట్ గా కూల్చాలా
*టిడిపి అడ్డుపడడంపై జగన్ విచారం
*చంద్రబాబు-రాక్షసులు- యజ్ఞం- బొత్స వ్యాఖ్య
*పోలవరం లో గడ్డర్ల ఏర్పాటు ఆరంభం
*మేం కట్టించిన ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*సబ్బం హరి ఉత్తరాంద్ర ద్రోహి
*టి. లో బాద్యతలనుంచి తప్పుకుంటున్న డాక్టర్ లు
*నగరం వీడి వెళ్లవద్దు-మంత్రి విజ్ఞప్తి
*ఎపిలో స్కూళ్ల కు రంగులు- జాగ్రత్త సుమా
*శానిటరీ సిబ్బందికి పిపిఈ కిట్స్ ఇచ్చారు
*సీజనల్ వ్యాధులతో జాగ్రత్త- ఆరోగ్య మంత్రి
*టి.బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి
*చేతి వృత్తులకు వైభవం తెచ్చిన కెసిఆర్
*ముఖ్యమంత్రి ఆఫీస్ మెడక్ బంగారం స్మగ్లింగ్ కేసు
*అడిగి మరీ రాజమండ్రి జైలుకు టిడిపి మాజీ మంత్రి
*ఇళ్ల స్థలాలు- చంద్రబాబు సైంధవ పాత్ర
*గవర్నర్ తమిళపై మరో అడుగు వేశారు..
*ఆన్ లైన్ క్లాస్ లైతే వీసాలకు అమెరికా నో
*కెసిఆర్ అనుకున్న పని చేస్తున్నారు
*గవర్నర్ తమిళసైకి, సర్కార్ కు బెడిసిందా
*సగం ఆర్టిసి బస్ లు కూడా తిరగడం లేదు..
*అయ్యన్న కౌరవ సభలో మాట్లాడినట్లుగా..
*ఓట్ల చీలిక పాచిక- ట్రంప్ కు కలిసి వస్తుందా
*నేరాలకు కులాలు,మతాలు ఉండవు
* సంక్షేమ షెడ్యూల్ ఇచ్చిన సి.ఎమ్.ను చూశామా
*మూడు రోజుల్లో మూసికి కొత్తగేట్లు
*తెలంగాణలో కరోనా - బాలల పరిస్తితి
*తెలంగాణలో 197 మంది జర్నలిస్టులకు కరోనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info