A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
90 శాతం హామీలను జగన్ నెరవేర్చారు
Share |
January 26 2020, 2:30 pm

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని రైతులకు న్యాయం చేస్తారని, ఆయన రైతుల పక్షపాతి అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయటమే సీఎం జగన్‌ లక్ష్యమని పేర్కొన్నారు. ‘ ముఖ్యమంత్రి జగన్‌ 7 నెలల్లోనే 90 శాతం హామీలను నెరవేర్చారు. మూడు రాజధానుల ప్రతిపాదనను అన్ని వర్గాలు హర్షిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తాత్కాలిక భవనాలు కట్టడం తప్ప ఏమీ చేయలేదు. తన ఆస్తులను కాపాడుకోవటం కోసమే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. తన స్వార్థం కోసం చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. పేదలు, విద్య, వైద్యం కోసం చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించలేదు. పేదపిల్లల చదువుకోసం వైఎస్‌ జగన్‌ అమ్మ ఒడి పథకం తీసుకొచ్చారు. మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం ఉండేలా మెను మార్పు చేశాం. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తున్నా’మని తెలిపారు.

tags : narayanaswamy

Latest News
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info