A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ద్వారంపూడి వివరణ ఇచ్చారు కాని...
Share |
September 19 2020, 8:59 am

తాను పవన్‌పై చేసిన వ్యాఖ్యలను జనసేనకు చెందిన కొందరు నేతలు పని గట్టుకొని కుల ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని కాకినాడు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. తాను రాజకీయంగా ఎదిగిందే కాపు నేతల ద్వారా అని, జక్కంపూడి రామ్మోహన్ రావు శిశ్యుడిగా ఎదిగానని ఆయన చెప్పారు.కాపు ఉద్యమ సమయంలో ముద్రగడ కుటుంబంపై లాఠీచార్జ్‌ చేస్తే పవన్‌ గానీ జనసేన నాయకులు కానీ ఖండించలేదు. ముద్రగడ బహిరంగ సభ పెడితే నా వెంట ఉన్న కాపులంతా 25 బస్సులతో వెళ్లి ఉద్యమానికి మద్దతిచ్చాం. కాపు ఉద్యమానికి చంద్రబాబు వ్యతిరేకం. అందుకే పవన్‌కళ్యాణ్‌ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం కోసం వైసిపిని పవన్ విమర్శిస్తుంటారని ఆయన అన్నారు.


అయినా అబ్యంతరకర పదాలకు సారీ చెప్పాలి కదా!

tags : dwarampudi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info