A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రాంతాల మద్య చిచ్చుకు కొన్ని పార్టీల యత్నం
Share |
September 22 2020, 9:46 am

ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయని ఎపి టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.అమరావతి రాజధాని కాదని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. ఇతర ప్రాంతాల అబివృద్ది కోసం మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తే చంద్రబాబు ఇంత గగ్గోలు పెడుతున్నారని ఆయన అన్నారు. సరైన సదుపాయాలు లేక ఉత్తరాంధ్ర వెనకబడిపోయిందన్నారు. రాయలసీమ అంటే ఫ్యాక్షనిస్టులు, ఉత్తరాంధ్ర అంటే కమెడియన్లుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి ఉండకూడదనే సీఎం జగన్ తపన అని తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్దే సీఎం జగన్ ఉద్ధేశ్యమని.. ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతి మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని శ్రీనివాస్ తెలిపారు.

tags : avanti, parties

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info