A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏ ఆందోళన అయినా హింసకు దారి తీస్తే..ఆర్టికిల్
Share |
September 19 2020, 9:02 am

రాజధాని పేరుతో సాగుతున్న ఆందోళనలు ఏ రూపం దాల్చుతున్నాయి?మాచర్ల వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపైకాని, పామర్రు రిజర్వుడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పై దాడి చేసిన తీరు ఏ మాత్రం సమర్దనీయం కాదు. రైతులు దాడులకు పాల్పడుతున్నారని టిడిపి ,జనసేన వంటి పార్టీలు ఎంత సమర్దించుకోచూసినా అది వారికి నష్టమే తప్ప లాభం ఉండదు. రాజదానిపై పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం రాలేదు. శాసన రాజదానిగా అమరావతి ఉంటుందన్న సంకేతం ఇప్పటికే వచ్చింది. అయినా రాజదాని ప్రాంతంలోని కొన్ని గ్రామాలలో ఈ ఆందోళనలు సాగుతున్న వైనం , టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కాని, ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి పత్రికలు రెచ్చగొడుతున్న వైనం కాని అంతా గమనిస్తూనే ఉన్నారు. రాజదానిపై ఒక అబిప్రాయం చెప్పడం తప్పుకాదు. ప్రభుత్వ వైఖరి నచ్చకపోతే దానిని తప్పుపట్టడం ,నిరసన చెప్పడం ఆక్షేఫణీయం కాదు. కాని తాము అదికారంలో ఉంటే ఎవరిని ఉద్యమం అన్నమాటను ఒప్పుకోం. ఎవరినైనా అరెస్టు చేస్తాం..అని బెదిరించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజలంతా పోరాటాలు చేయాలని అంటున్నారు. గతంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆందోళనలు చేస్తుంటే,చివరికి వారు పళ్లాలు మోగిస్తూ నిరసన తెలపడానికి కూడా ఒప్పుకోలేదు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన ఇంటిలో దీక్షకు దిగుతానన్నా అంగీకరించలేదు. ఆయనను,ఆయన కుటుంబ సభ్యులను బూతులు తిడుతూ అరెస్టు చేశారు.ఎమ్.ఆర్.పిఎస్ .నేత అమరావతి వద్ద ప్రదాన రహదారిపై ర్యాలీ తీయడానికి అంగీకరించలేదు. ఎమ్.ఆర్.పిఎస్.కార్యకర్తలను ఎక్కడకక్కడ దిగ్భందించారు . తమ పార్టీ ఎమ్.పిటిసిలను ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు బలవంతంగా తీసుకు వెళ్లారని నిరసన చెప్పడానికి అంబటి రాంబాబు వెళితే ఆయనను కదలనివ్వలేదు. అలాగే వైసిపి నేతలకు మద్దతుగా వెళ్లిన బొత్స సత్యనారాయణను తెనాలి పోలీస్ స్టేషన్ కు తరలించారు ప్రత్యేక హోదాపై కాండిల్ ర్యాలీకి విశాఖపట్నం వెళ్లిన ఆనాటి ప్రతిపక్ష నేత జగన్ విమానం దిగగానే రన్ వే పైనే నిలిపివేసి వెనక్కి పంపించారు.అసలు అప్పుడు ఎవరైనా ఆందోళన అంటే అ భివృద్దిని అడ్డుకోవడానికే అని చంద్రబాబు ప్రచారం చేసేవారు. ఒకసారి గతంలో కి వెళితే రాజీవ్ గాంధీ హత్యకు గురైతే దాడులు జరిగాయి. టిడిపి నేతలను టార్గెట్ చేసుకుని కొందరు కాంగ్రెస్ వారు, మరికొందరు అసాంఘీకశక్తులు ఈ దాడులకు పాల్పడ్డాయి .హైదరాబాద్ లోని ఎన్.టి.ఆర్.ఎస్టేట్ లోని సినిమాహాళ్లపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అప్పుడు ఎన్.టి.రామారావు టాంక్ బండ్ పై నిరాహార దీక్షకు కూర్చుకున్నారు. ఆయనను చూడడానికి జనం వస్తుండడంతో ఆనాటి ముఖ్యమంత్రి జనార్దనరెడ్డి ప్రభుత్వం అరెస్టు చేసి దీక్షను విరమింప చేసింది.వంగవీటి రంగా విజయవాడ లో దీక్ష చేస్తున్నప్పుడు కొందరు టిడిపి వారు ఆయనను హత్య చేశారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున హింస చెలరేగింది.ఒక వర్గంపై విపరీతంగా దాడులు జరిగాయి.ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. చంద్రబాబు నాయుడు అదికారంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీల సమస్యపై ఆందోళన జరిగితే కాల్పులు జరగ్గా నలుగురు రైతులు మరణించారు.అంతేకాదు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆద్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్ లలో దీక్ష చేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వంలోని పోలీసులు నానా భీభత్సం సృష్టించారు.కాంగ్రెస్ టైమ్ లో టిడిపి ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర హత్యకు గురైతే ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు వందల కొద్ది బస్ లను దహనం చేశారు. గత టరమ్ లో తుని వద్ద కొందరు రైలును దగ్దం చేస్తే దానిని ఆర్పే పని చేయించడం మాని,ప్రతిపక్ష నేత జగన్ పై ఆరోపణలు గుర్పించడానికి చంద్రబాబు మీడియా సమావేశం పెట్టారు.ఇక రాజధానిలో గ్రామాలలో భూములు ఇవ్వబోమన్న రైతులను చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని హింసలకు గురి చేసింది అందరికి తెలిసిందే.చివరికి ప్రభుత్వమే పంటలు దహనం చేసే నీచానికి పాల్పడింది అందరికి తెలుసు. రాజదాని లో రైతులు వ్యవసాయం కోసం తమ భూములు తమకు ఇవ్వండని అడగడం లేదు. తమకు రియల్ ఎస్టేట్ విలువ తగ్గుతుంది కనుక ఇక్కడే అన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా ఫర్వాలేదు. వారు ప్రభుత్వంతో కాని,ముఖ్యమంత్రితో కాని, మంత్రులతో కాని చర్చలకు ఆసక్తి చూపకుండా ముఖ్యమంత్రి జగన్ ను దూషించడానికి , వైసిపిని తిట్టడానికి ప్రాదాన్యం ఇస్తున్నారు. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి టిడిపి పత్రికలు మద్దతు ఇస్తున్నాయని రెచ్చి పోయి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. పార్టీలకు అతీంగా ఆందోళనలు చేయడం లేదు. చంద్రబాబు రోజూ వెళ్లి వారిని రెచ్చగొట్టి విరాళాలు వసూలు చేసి ఉద్యమం నడిపిస్తున్నారు. ప్రభుత్వం అంతిమ నిర్ణయం తీసుకునేవరకు ఇలాంటి వాటిని టిడిపి నేతలు కొందరు చేయిస్తుండవచ్చు.కాని రైతులకు ఏమి ఉపయోగం.రైతులు తమ డిమాండ్ లు ఏమిటో ప్రభుత్వానికి తెలిపి వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తే మంచిది. అలాకాకుండా ప్రజలందరికి ఇబ్బంది కలిగేలా రోడ్డుమీద ఆందోళనలు చేయడానికి వస్తే,ఆ ఆందోళనలలో పార్టీ పిచ్చితోనో, కుటపిచ్చితోనో ఎవరైనా ప్రవేశించి ఇలా దాడులకు తెగబడితే నష్టపోయేది రైతులు,సామాన్యులే అన్న సంగతి అర్ధం చేసుకోవడం మంచిది. ఆంద్రజ్యోతిలో ఎప్పుడో మంటలు రావాలని వార్తలు రాశారు. అవి రావడం లేదని టిడిపి వారితో ఇలా ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తుంది.ఏది ఏమైనా హింస పెరిగిందంటే ఆ ఉద్యమానికి నష్టం మొదలైందన్నమాట. ప్రజాస్వామ్య పద్దతులు కాకుండా చంద్రబాబునో,ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి పత్రికలనో నమ్ముకునే రాళ్లు విసరడాలు, కర్రలతో దాడులు చేయడాలు ,అరకాలకు పాల్పడడం చేస్తే ఆ పత్రికలు రణరంగం అని, పోరు అని రాయడం ఒక రోజు వరకు చదవడానికి బాగుండవచ్చు.కాని ఆ తర్వాత ఎదురయ్య సమస్యలకు ఆ మీడియా కాని, చంద్రబాబు కాని బాద్యత వహించారు. వాళ్లు సేఫ్ గానే ఉంటారు. ఎటుతిరిగి ఆందోళనలలో పాల్గొనేవారే నష్టపోతారు.చంద్రబాబు తాను అదికారంలో ఉంటే ఎవరూ నిరసనలు తెలపరాదని భావిస్తారు. తాను ప్రతిపక్షంలో ఉంటే అంతా వచ్చి పోరాటాలు చేయాలని ,హింసలకు దిగాలని భావిస్తారు.ఆయన అదికారం కోసం ఏమైనా చేయాలని అనుకుంటారు.నిజంగా రాజదాని రైతులు తమకు నష్టం వస్తోందని భావిస్తే చంద్రబాబును కాని,ఇతర రాజకీయ పార్టీలను కాని పక్కనబెట్టి స్వయంగా నిరసన తెలిపి,ప్రభుత్వంతో మాట్లాడుకునే సంగతి ఆలోచించడం మంచిదని చెప్పాలి.

tags : agitations

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info