A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపి ఎమ్మెల్యే ద్వారంపూడి తోలు తీస్తాం
Share |
January 26 2020, 1:54 pm

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తోలు తీస్తామని, కొవ్వు చెక్కుతామని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరించారు. చంద్రశేఖరరెడ్డి తమ పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు ను నోటీకి వచ్చినట్లు దూషించారని,దీనిపై ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని ఆయన అన్నారు. ద్వారంపూడి మాటలకు తగు సమాదానం ఇవ్వవలసి ఉంటుందని ఆయన అన్నారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన అన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే, వాళ్లు మమ్మల్ని, మేము వాళ్లను తిట్టుకుంటాం..తర్వాత కొట్టుకోవడాలు, హత్యలు చేసుకునేవరకు వెళతారా అని ఆయన అన్నారు. ద్వారంపూడి కొవ్వును కాకినాడ ప్రజలు చెక్కుతారని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా కాకినాడలో ద్వారంపూడి ఇంటి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. జనసేన కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేయగా, వైసిపి నేతలు ఎదురుదాడి చేశారని వార్తలు వచ్చాయి.ఇరుపక్షాలు కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డాయి. నరసరావుపేటలో కూడా జనసేన కార్యకర్తలు ద్వారంపూడి వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేశారు.


ద్వారంపూడి తన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పి ఉండాల్సింది.ఇలాంటి వాటి వల్ల ముఖ్యమంత్రి జగన్ కు ఇబ్బందే. పార్టీకి ఇబ్బందే.

tags : ap, dwarampudi

Latest News
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info