A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పెరేడ్ గ్రౌండ్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్
Share |
September 22 2020, 11:03 am

రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడా , పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహణ పై పత్రికా సమావేశం బేగంపేట లోని టూరిజం ప్లాజా హోటల్ లో నిర్వహించారు.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో
అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జనవరి 13 నుండి 15 వరకు మూడు రోజుల పాటు సికింద్రాబాద్ లోని
పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
ఈ ఫెస్టివల్ లో సుమారు 20 దేశాల నుండి సుమారు 40  కి పైగా అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ప్లేయర్స్
పాల్గొంటున్నారని అంతే కాకుండా సుమారు ఇరవై ఐదు రాష్ట్రాల నుండి 60 మంది కైట్ ప్లేయర్స్ తో పాటు
హైదరాబాద్ కు చెందిన కైట్ క్లబ్ లు పాల్గొంటారన్నారు. 1000 కి పైగా స్వీట్ లను ఈ ఫెస్టివల్ లో హైదరాబాద్
లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు తమ ఇంటిలో తయారు చేసిన స్వీట్ లను ఈ ఫెస్టివల్ లో 
అమ్మకాలు జరుపుతారని వెల్లడించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంప్రదాయ ఆటలు ను
నిర్వహిస్తున్నామన్నారు.
ఈ నెల 13 , 14, 15 తేదీల్లో  జరగనున్న అంతర్జాతీయ కైట్, స్వీట్ మరియు స్నాక్స్  పెస్టివల్ తో పాటు
తెలంగాణ రాష్ట్ర స్థాయి సంప్రదాయక ఆటలను నిర్వహిస్తున్నామన్నారు.
20 పైగా దేశాలకు చెందిన వారు ఈ కైట్ మరియు స్వీట్ ఫెస్టివల్లో పాల్గొంటారని వెల్లడించారు.
దేశం నలుమూలల నుండి పెద్ద ఎత్తున కైట్ ప్లేయర్ లు, సందర్శకులు ఈ ఫెస్టివల్లో పాల్గొంటారన్నారు.
రాబోయే కాలంలో త్రీ డేస్ నుండి వారం రోజుల పాటు  ఈ ఫెస్టివల్స్ జరుపుతామన్నారు.
అన్ని రకాల సాంప్రదాయబద్ధమైన పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు , షాపింగ్,  వంటకాలు అన్ని ఏర్పాట్లను
అందుబాటులో ఉంచుతామన్నారు.
ఈసారి 12 నుండి 15 లక్షల మంది వస్తారని అంచనా...
సందర్శకులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం ...
చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ పాల్గొనే కార్యక్రమాలు ఉంటాయి ...

tags : sweet festival

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info