A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెగింపు లేకపోతే ముందుకు వెళ్లలేం- పవన్ కళ్యాణ్
Share |
January 26 2020, 8:09 pm

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో అనుభవం ఉన్నవారితోపాటు యువతరానికి
పెద్ద పీట వేస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
తెలిపారు. ఏళ్ల తరబడి నిస్వార్ధంగా పార్టీ జెండా మోసిన యువతకు 50
శాతం టికెట్లు ఇచ్చి నిలబెడతామని అన్నారు. స్థానిక పోరులో కుల, వర్గ
పోరాటాలతో పాటు దౌర్జన్యాలు ఉంటాయని, ఆ పరిస్థితులను
ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలంటూ దిశానిర్దేశం చేశారు. తెగింపు
లేకపోతే ముందుకు వెళ్లలేమన్న పవన్ కళ్యాణ్ .. కొత్తరక్తం
రాకపోతే రాజకీయాల్లో మార్పు రాదని స్పష్టం చేశారు.
మంగళగిరి పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి
సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు, రాజధాని అంశాలపై
చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ..
“సుదీర్ఘ లక్ష్యాలను అందుకోవాలంటే చాలా కష్టపడాలి. అందుకే పార్టీ
స్థాపించినప్పటి నుంచి 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అని చెబుతున్నాను.
పార్టీ కోసం నిస్వార్ధంగా పని చేసిన యువతను గుర్తించాల్సిన బాధ్యత
జిల్లా నాయకత్వంపై ఉంది. పార్టీ సంస్థాగత నిర్మాణానికి స్థానిక
సంస్థల ఎన్నికలు మంచి అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. స్థానిక
ఎన్నికల్లో కులాలు, మతాలు, వర్గాలు తీవ్ర స్థాయిలో ప్రభావం
చూపిస్తాయి. ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను తమకు అనుకూలంగా
మార్చుకుంది. అయితే రిజర్వేషన్లను చూసి జనసేన పార్టీ భయపడాల్సిన
అవసరం లేదు. కులాలు, మతాలకు అతీతంగా జనసేన పార్టీకి అభిమానులు ఉన్నారు.
వారిని గుర్తించి ఎన్నికల్లో నిలబెడదాం. ఎన్నికల కోసం మాత్రమే
పార్టీలోకి వచ్చే వలస పక్షులను గుర్తించే బాధ్యత స్థానిక నాయకులదే.
ఎవరైనా పార్టీలోకి రావాలనుకుంటే వారి చిత్తశుద్ధిని పరిగణలోకి
తీసుకోండి.

• ఎన్నికల పర్యవేక్షణ కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి ఎలక్షన్ కమిటీలు
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు
ఉంటాయి. కొంత మంది నాయకులు బెదిరింపులకు దిగుతుంటారు. ఇలాంటి
బెదిరింపులకు కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. పార్టీ తరఫున
హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు.. లీగల్ టీం అందుబాటులో ఉండే
ఏర్పాటు చేస్తాం. అలాగే అభ్యర్ధులకు బీ ఫాం ఇవ్వడానికి ఐదుగురు
సభ్యులతో కూడిన కమిటీని కూడా వేస్తాం. అలాగే స్థానిక సంస్థల
ఎన్నికలను పర్యవేక్షించడానికి పార్టీ తరపున రాష్ట్ర స్థాయి, జిల్లా
స్థాయి ఎలక్షన్ కమిటీలను నియమిస్తాం.అని ఆయన చెప్పారు.

tags : pawankalyan

Latest News
*బాబు కు ర్యాంకు ఇవ్వనంటున్న విజయసాయి
*అసెంబ్లీకి సమావేశాలకు టిడిపి దూరం
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*6గురు ఎమ్మెల్సీలు టిడిఎప్పి భేటీకి దూరం
*చంద్రబాబు చీకటి, జగన్ వెలుతురు
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info