A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వేర్వేరు దారులలో వివేక్, వినోద్
Share |
September 22 2020, 9:50 am

కేంద్ర మాజీ మంత్రి,దివంగత నేత వెంకటస్వామి కుమారులు ఇద్దరో రాజకీయంగా చెరో దారి లో ఉన్నారు. ఇద్దరూ ఇంతకాలం ఒకే పార్టీలో ఉండే యత్నాలు చేశారు. కాని తాజాగా మాజీ ఎమ్.పి వివేక్ బిజెపిలో కొనసాగుతుండగా, ఆయన సోదరుడు, మాజీ మంత్రి వినోద్ కాంగ్రెస్ లోకి తిరిగి ప్రవేశించారు. గతంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీల్లో పనిచేసిన వినోద్‌.. 2018 శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేశారు. ఆయన సోదరుడు, మాజీ ఎంపీ జి.వివేక్‌ కొంతకాలం క్రితం బీజేపీలో చేరగా.. వినోద్‌ మాత్రం స్వతంత్రంగానే రాజకీయాల్లో కొనసాగుతున్నారు.తాజాగాఆయన కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ పార్టీతో నాకు 35 ఏళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయిని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

tags : vivek, vinod

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info