A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వివాదంలో నటుడు పృధ్వీ- సి.ఎమ్. ఆగ్రహం
Share |
September 22 2020, 9:52 am

ఎస్వి బిసి చానల్ చైర్మన్ ,నటుడు పృద్విరాజ్ వివాదాలలో పడ్డారు. ఆయన కొదరు రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి.స్వయంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే మరో నటుడు పోసాని కృష్ణమురళీ తీవ్రంగా స్పందించారు.దానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా సీరియస్ గా తీసుకుని పృద్వీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారనిసమాచారం. సమస్యలపై మాట్లాడాలే తప్ప.. కులాల ప్రస్తావన సరికాదని స్పష్టం చేశారు. రైతులపై ఇష్టానుసారంగా మాట్లాడటాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోందని పార్టీ వర్గాలు తెలిపారు. కులాలను ప్రస్తావిస్తూ.. ఎవరినీ కించపరిచేలా మాట్లాడకూడదని జగన్ ఆదేశాలు ఇచ్చారు.దానికి తోడు పృద్వీ ఒక మహిళతో మాట్లాడినట్లు మరో వీడియో వైరల్ అవుతోంది. దానిలో ఎంత నిజం ఉందో తెలియదుకాని అది వాస్తవం అయితే ఆయన ఇబ్బందిలో పడినట్లే అనుకోవాలి.

tags : pridwi ,controversy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info