A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరానికి నిధుల ప్రాదాన్యం- మంచి నిర్ణయమే
Share |
September 22 2020, 9:54 am

పోలవరం ప్రాజెక్టును చెప్పిన టైమ్ ప్రకారం పూర్తి చేయడానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతోందన్న వార్త వచ్చింది. నిజంగా అలా జరిగితే సంతోషించవలసిందే.
. హెడ్‌ వర్క్స్‌.. ఎడమ కాలువ, కుడి కాలువ, కనెక్టివిటీల(అనుసంధానాలు) పనులతోపాటు నిర్వాసితుల పునరావాస కాలనీల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది.ఒక్క పోలవరం ప్రాజెక్టుకే నెలకు సగటున రూ.1,100 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంటుంది. బడ్జెట్‌ పరిమితుల దృష్ట్యా ఆ స్థాయిలో నిధులు సమకూర్చడం కొంత కష్టతరమవుతుంది. అందుకే సహాయ పునరావాస ప్యాకేజీ కింద నిర్వాసితులకు రాష్ట్ర ఖజానా నుంచి చెల్లింపులు చేసి, కాంట్రాక్టర్లకు ‘బిల్‌ డిస్కౌంట్‌’ విధానంలో బిల్లులు చెల్లించడం ద్వారా నిధుల కొరత ఎదురుకాకుండా చూసేందుకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ కసరత్తు చేస్తున్నారు. ఈ విధానంలో.. కాంట్రాక్టర్లు బీజీ(బ్యాంకు గ్యారంటీ), ఈఎండీ(ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌), పెర్‌ఫార్మెన్స్‌ గ్యారంటీ(పీజీ), రిటెన్షన్‌ అమౌంట్‌(ఆర్‌ఏ) రూపంలో బ్యాంకు ద్వారా ప్రభుత్వానికి గ్యారంటీలను సమర్పిస్తారు.

ఈ గ్యారంటీలకు సమానమైన నిధులను సంబంధిత బ్యాంకులో కాంట్రాక్టర్లు డిపాజిట్‌ చేయాలి లేదా అంతే విలువైన ఆస్తులను తనఖా పెట్టాలి. వాటిపై నిబంధనల మేరకు బ్యాంకు సంబంధిత కాంట్రాక్టర్‌కు వడ్డీ చెల్లిస్తుంది. పోలవరం ప్రాజెక్టులో ప్రతినెలా చేసిన పనుల మేరకు చెల్లించాల్సిన బిల్లులను.. ఆయా కాంట్రాక్టర్లు గ్యారంటీ ఇచ్చిన బ్యాంకులకు ప్రాజెక్టు అధికారులు పంపిస్తారు. వాటిని కాంట్రాక్టర్లకు చెల్లించాలని ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఆ మేరకు బ్యాంకులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తాయి. బ్యాంకులు చెల్లించిన ఈ సొమ్మును 90 రోజుల్లోగా ప్రభుత్వం రీయింబర్స్‌ చేయాలి. గడువు దాటితే బ్యాంకు వడ్డీ వసూలు చేస్తుంది. జలయజ్ఞం ప్రాజెక్టుల పనులకు బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తకుండా 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ‘బిల్‌ డిస్కౌంట్‌’ విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేయాలని జలవనరులశాఖ భావిస్తోంది. ఈ విధానం ద్వారా రాష్ట్ర ఖజానాకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.

tags : polavaram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info