A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్పీకర్ కు డబ్బులు దండుకోవడమే తెలుసు
Share |
September 22 2020, 9:56 am

స్పీకర్ తమ్మినేని సీతారామ్ పై ఆయన ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ విమర్శలు చేశారు.ఏ ఎండకా గొడుడు, ఏ పూట కామాట మాట్లాడడమే స్పీకర్‌ తమ్మినేని సీతారాం నైజం. ఉద్యమాల పేరిట కాసులు దండుకోవడమే సీతారాంకు తెలిసిన పని అని ఆయన ద్వజమెత్తారు. డబ్బుల కోసం ఏ వీధి పోరాటాలు చేయాలి, పారిశ్రామికవేత్తలను ఎలా బ్లాక్‌మెయిల్‌ చేయాలి, వారివద్ద ఎంతెంత డబ్బులు గుంజాలో సీతారాంకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదన్నారు. ఇప్పుడు కూడ ఆమదాలవలసలో తాను సాగిస్తున్న ఇసుక దోపిడీకి సీఎం జగన్‌ అడ్డు చెప్పకుండా వుండేందుకే నిత్యం ఆయనకు డప్పు వాయిద్యాలు కొడుతున్నాడని మండిపడ్డారు.శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుతనానికి సీతారామే మూలకారకుడని వివరించారు. నిత్యం బూతులు, అసత్యాలు వల్లించే సీతారాం గౌరవప్రదమైన స్పీకర్‌ పదవికి అనర్హుడనీ, తక్షణమే రాజీనామా చేయాలని కూన డిమాండ్‌ చేశారు.

tags : kuna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info