A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చిరుపై అశ్వనీ దత్ కామెంట్స్
Share |
September 19 2020, 7:05 am

మూడు రాజధానుల ప్రతిపాదనను సినీనటుడు చిరంజీవి స్వాగతించడాన్ని ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్‌ తప్పుబట్టారు. రాజధాని అమరావతిలో రైతుల ఉద్యమానికి ఆయన మద్దతు పలికారు. మందడంలో దీక్ష చేస్తున్న రైతుల శిబిరం వద్దకు శనివారం ఆయన వచ్చారు. వారికి సంఘీభావం తెలిపారు. రాజదాని గ్రామాలలో ఉద్యమం నడుపుతున్న ఒక టీవీ చానల్ తో మాట్లాడుతూ చిరంజీవి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ‘చిరంజీవికి ఏం తెలుసని మూడు రాజధానులు బాగుంటాయని చెప్పారు. ప్రపంచంలో బహుళ రాజధానుల వ్యవస్థ విఫలమైన విషయం ఆయనకు తెలియదా? పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో నటిస్తే కోట్లలో సంపాదిస్తారు.ఆయన సినిమాలు వదిలేసి రైతుల కోసం ఎందుకు పోరాడుతున్నాడో చిరుకు తెలియదా?బహుళ రాజధాని వ్యవస్థను ఎవరు సమర్థించినా అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉం డదని ఆయన వ్యాఖ్యానించారు.

tags : aswani dutt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info