A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇది గ్రాఫిక్స్‌ ప్రభుత్వం కాదు..
Share |
September 20 2020, 12:53 am

కొద్ది రోజుల నుంచి టీడీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు తనదైన శైలిలో డ్రామాకు తెర తీశారు. రైతుల్లో లేనిపోని అపోహలతో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. అమరావతిలో భూ దందాను నడిపి ఆయన లబ్ది పొందాలని చూస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చంద్రబాబుకు పట్టదా? వెనుకబడిన ప్రాంతాలు అలానే ఉండాలా? కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు. జోలె పట్టుకొని తిరగడానికి చంద్రబాబుకు సిగ్గులేదా? ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి. ఇది గ్రాఫిక్స్‌ ప్రభుత్వం కాదు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆయన అన్నారు.

tags : kannababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info