A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి అద్యక్షుడిని మార్చరా
Share |
September 20 2020, 1:21 am

తెలంగాణ బిజెపి అద్యక్షుడుగా డాక్టర్ కె.లక్ష్మణ్ ను కొనసాగించవచ్చని కదనాలు వచ్చాయి. లక్ష్మణ్‌ రాష్ట్ర పగ్గాలు చేపట్టి మూడేళ్లు దాటడంతో పార్టీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష బాధ్యతల్లో మార్పు చేయాలి. అయితే మరో సారి ఆయనకే చాన్సివ్వాలని, మున్సిపల్‌ ఎన్నికల తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన డీకే అరుణ, ఎంపీ బండి సంజయ్, సీనియర్‌ నేతలు చింతల రాంచంద్రారెడ్డి, రాంచందర్‌రావు, యెండెల లక్ష్మీనారాయణ తదితరుల పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి. మరోవైపు తనకు ఏ బాధ్యతను అప్పగిస్తే ఆ పని చేస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అంటున్నారు. అయినా ప్రస్తుతానికి లక్ష్మణ్ ను కొనసాగించవచ్చని చెబుతున్నారు.

tags : lakshman

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info