A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కంటే నాకే స్పందన వచ్చింది-పవన్ కళ్యాణ్
Share |
September 19 2020, 11:37 pm

మళ్లీ బిజెపి,టిడిపిలతో కలిసి పనిచేయాలని, పొత్తు పెట్టుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా ఉంది. ఆయన పార్టీ నేతలను ఉద్దేశించి చేసిన ప్రసంగం లో అంశం వచ్చింది.ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


• బీజేపీ, టీడీపీతో విడిపోయాం కనుకే వైసీపీ బలపడింది
ప్రజలకు మంచి పాలన అందాలనే ఉద్దేశంతో 2014లో భారతీయ జనతా పార్టీ,
తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాం. కొన్ని కారణాలతో తెలుగుదేశం
పార్టీని వ్యతిరేకించి 2019లో ఒంటరిగా పోటీ చేశాం. బీజేపీ, తెలుగుదేశం,
జనసేన పార్టీ విడిపోయాయి కనుక వైసీపీ బలపడింది.
• రాజధానిపై స్పష్టత ఇవ్వాల్సింది వైసీపీ ప్రభుత్వమే
తమిళనాడులో కరుణానిధి గారు అసెంబ్లీ నిర్మిస్తే దానిని జయలలిత గారు
ఆస్పత్రిగా మార్చేశారు. 2015లో అమరావతి కోసం తెలుగుదేశం ప్రభుత్వం
పెద్ద ఎత్తున భూ సమీకరణ చేపడితే అప్పుడే భయమేసి అడిగాను.. తర్వాత
వచ్చిన పాలకులు దీనిని కొనసాగించకపోతే పరిస్థితి ఏంటని..? ఎందుకంటే
ఇలాంటి రాజధాని వాస్తవ రూపం దాల్చాలంటే కనీసం రెండున్నర దశాబ్ధాలు
పడుతుంది. ఆ రోజు నేను వ్యక్తం చేసిన భయమే ఇవాళ నిజమైంది. రాజధాని
విషయంలో జనసేన పార్టీ తరపున స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం. పాలన
ఒకే చోటు నుంచి జరగాలి... అభివృద్ధి అన్ని చోట్లకి అని స్పష్టంగా
చెప్పాం. రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలి. మూడు
రాజధానులు ఎలా సాధ్యమవుతుందో ప్రజలకు తెలియజేయాలి. మూడు రాజధానుల
ప్రకటన చేసి ముఖ్యమంత్రి విశాఖపట్నం వెళితే స్పందన ఎలా వచ్చిందో
మనందరం చూశాం. అదే జనసేన పార్టీ ఇసుక సమస్యపై లాంగ్ మార్చ్ పెడితే
ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వచ్చిందో కూడా మనం చూశాం. ప్రజా
సమస్యలపై నిలబడతాము కాబట్టే మనకు ఆ స్పందన వచ్చింది. కోట్లాది
మంది ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. రాజధాని కోసం
భూములు త్యాగం చేసిన రైతులకు అండగా జనసేన పార్టీ ఉంటుంది. వారికి
న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుందని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info