A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ పై కన్నా విమర్శలు
Share |
September 19 2020, 11:39 pm

తెలుగుదేశం పార్టీ ,వైఎస్ ఆర్ కాంగ్రసె్ పార్టీలు భూ దందాలు చేస్తున్నాయనీ.. రాజధానిలో అక్రమాలు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయని బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.రాజదాని 29 గ్రామాల సమస్య కాదని, రాష్ట్ర ప్రజల సమస్య అని ఆయన అన్నారు. ప్రాంతీయ విద్వేషాలు సృష్టించడాఇనకి యత్నాలు జరగుతున్నాయని ఆయన అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ముసుగులో రాజధానిని తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్‌ కుట్రపూరిత ఆలోచనలు చేస్తున్నారని ఆరోపించారు. పాలన వికేంద్రీకరణకు కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణకు భాజపా కట్టుబడి ఉందని చెప్పారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని తాము కోరుతున్నామని చెప్పారు. ప్రభుత్వం మారినంత మాత్రాన రాజధానిని మార్చకూడదన్నారు సంక్రాంతి తర్వాత రాజధాని అంశంపై ప్రత్యక్ష పోరాటంలోకి దిగాలని భాజపా నిర్ణయించిందని తెలిపారు.

tags : jagan,kanna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info