A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజలు మోసపోయామని అనుకుంటున్నారు-బాబు
Share |
September 20 2020, 12:38 am

ఎపికి ఒకే రాజధాని ఉండాలన్నదే తమ నినాదం అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ ఏపీ అంటే అమరావతి, పోలవరం అని అన్నారు. ఈ రాష్ట్రానికి అమరావతి, పోలవరం రెండు కళ్లు. స్వర్ణముఖి, సోమశిల, హంద్రీనీవా ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేశాం. తిరుపతిని విద్యా కేంద్రంగా మార్చాం అని ఆయన అన్నారు. ఎపిలో ఉన్న ప్రభుత్వ ఉన్మాద పాలన చూసి అనేకమంది పారిపోతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎందుకింత తపన అని కొందరు నన్నడిగారు. భావితరాలు బాగుండాలనేదే నా ఆలోచన. నేనెప్పుడూ 25 ఏళ్ల యువకుడిలా ఆలోచిస్తా. ఒక్కసారి అవకాశం ఇచ్చి మోసపోయామని అందరూ బాధపడుతున్నారు. అమరావతిని కాపాడుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదు అని ఆయన అన్నారు.

tags : chanrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info