A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిబిఐ - విజయసాయికి అమిత్ షా లేఖ
Share |
September 20 2020, 12:38 am

సిబిఐ హైదరాబాద్ అదికారిపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి రాసిన లేఖ ఆసక్తికరంగా ఉంది.దానిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాదానం ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇప్పటికీ సిబిఐని ప్రభావితం చేస్తున్నారని విజయసాయి ఆరోపించారు. లక్ష్మీనారాయణ రాజకీయాలలో ఉన్న సంగతిని ఆయన గుర్తు చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి లేఖపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. హైదరాబాద్‌లో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధంలేని అధికారిని నియమించాలన్న విజయసాయిరెడ్డి వినతిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖను ఆయన ఆదేశించారని వార్త వచ్చింది . దీనిని హోం మంత్రి అమిత్ షా లేఖ ద్వారా విజయసాయికి తెలియచేశారు.

tags : ami shaw

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info