A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ దారి పవన్ దే..నా దారి నాదే- రాపాక
Share |
September 19 2020, 11:41 pm

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తన దారి తనదేనని స్పష్టం చేశారు. పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ అబిప్రాయంతో తనకు సంబందం లేదన్నట్లు గా ఆయన మాట్లాడారు. ఆయన చెప్పదలచుకున్నది ఆయన చెబుతున్నారు..నేను చెప్పదలచుకున్నది నేను చెబుతున్నానని రాపాక అనడం విశేషం. అసెంబ్లీలో కూడా తాను జగన్ పాలనను, ఇంగ్లీష్ మీడియం గురించి సమర్దించిన విషయాన్ని గుర్తు చేశారు. మూడు రాజదానులు ఎపికి మంచిదేనని ఆయన స్పష్టం చేశారు.ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఉంటానని రాపాక వరప్రసాద్‌ అన్నారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సాహసం గొప్పదని ఆయన పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో ఎన్టీఆర్‌ టు వైఎస్సార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలను మంత్రి కొడాలి నానితో కలిసి ఎమ్మెల్యే రాపాక ప్రారంభించారు.

tags : rapaka

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info