A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా విష్ణు
Share |
September 19 2020, 11:50 pm

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు పదవి లభించింది. ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు ఇచ్చింది. మల్లాది విష్ణు పేరు కొద్ది నెలల క్రితమే ప్రచారం అయినా, ఉత్తర్వులు రాలేదు. తాజాగా ఈయనను నియమించినట్లు వార్తలు వచ్చాయి. 2009లో విష్ణు తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. విబజన పరిణామాల నేపద్యంలో ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగారు. 2019 ఎన్నికలకు కొంతకాలం ముందు ఆయన వైసిపిలోకి వచ్చి టిడిపి నేత బొండా ఉమపై 25 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఎపి అసెంబ్లీలో ఉన్న ఇద్దరు బ్రాహ్మణ ఎమ్మెల్యేలకు పదవులు ఇచ్చినట్లు అయింది. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఉప సభాపతి కాగా, మల్లాది విష్ణు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు.

tags : malladi vishnu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info