A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు జోలె-విజయసాయి వ్యాఖ్య
Share |
September 20 2020, 12:43 am

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయా చోట్ల జోలె పట్టి తిరుగుతుండడంపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ఆయన ట్విటర్ లో చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.

'చంద్రబాబు నాయుడి ముఖ్య సలహాదారు చిట్టి నాయుడే అయి ఉంటాడని అనుకుంటున్నారంతా. గాజులు, ఉంగరాల సేకరణ నుంచి జోలె పట్టుకునే దాకా రాజు గారి దేవతా వస్త్రాల కథ గుర్తుకొస్తోంది. తుపాన్లతో వేల కోట్ల నష్టం వాటిల్లినప్పుడు సైతం చేతులు చాపని వ్యక్తి ఇంతగా రగిలి పోవడం అలాగే అనిపించట్లేదూ?' అంటూ ట్విటర్‌ లో విమర్శించారు.

'చంద్రబాబు నాయుడి స్వభావం మొదటి నుంచి అంతే. ప్రజా ధనాన్ని తన సొత్తు అన్నట్టుగా అడ్డగోలుగా లూటీ చేస్తాడు. అడ్డం తన్నగానే తన బాధ ప్రజల బాధగా చిత్రీకరిస్తాడు. ఎల్లో మీడియా మోత మోగించే రోజుల్లో అయితే ఆడింది ఆటగా సాగేది? సోషల్ మీడియా సూర్యుడు పొడిచాక చీకటి చుక్కలు అదృశ్యమయ్యాయి' అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

tags : vijayasaireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info