A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేరళలో భారీ అక్రమ కట్టడాల కూల్చివేత
Share |
September 19 2020, 11:54 pm

ఎపిలో నది వెంట ఉన్న అక్రమ నిర్మాణాలు, ప్రతిపక్ష నేత అక్రమ ఇంటి జోలికి వెళ్లరాదని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంటే, కేరళలో ఒక భారీ బహుళ అంతస్థుల నిర్మాణాన్ని సుప్రింకోర్టు ఆదేశాల మేరకు క్షణాలలో కూల్చివేశారు. కోస్టల్ జోన్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించి వీటిని నిర్మించారని సుప్రింకోర్టు నిర్దారించి ఎట్టి పరిస్తితిలోను కూల్చివేయాలని స్పష్టం చేసింది.దాంతో రాష్ట్ర ప్రభుత్వం అందుకు చర్యలు తీసుకుంది.కొచ్చి వద్ద మరడు మున్సిపాల్టీలో ఈ తీర్పు అమలు చేశారు. ఇందుకోసం వందల కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు.. కూల్చివేతకు ముందు అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. మొత్తం 130 అపార్టుమెంటులలో మద్య, ఎగువ మద్య తరగతి వారు నివసిస్తున్నారు.వారిని పునరావాస కేంద్రాలలలోకి తరలించి కూల్చివేత చేపట్టారు.

tags : kerala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info