A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేశంలో ఉండడమే వేస్ట్ అంటున్న సుజనా
Share |
September 20 2020, 12:45 am

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎపిలో నేరాలు ,ఘోరాలు జరిగిపోతున్నాయని, వీటిని చూస్తూ ఊరుకోరాదని, అంతా కలిసి రావాలని ఆయన అన్నారు. ఇక్కడ ఉండజాలమని, ఈ దేశంలో పౌరుడుగా ఉండడం కన్నా కాందీశీకుడుగా వెళ్లిపోతామని ఆయన అన్నారు. ఈ దేశంలో ఉండలేమని, ఉండడమే వేస్ట్ అని ఆయన అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో స్థిర నివాసం ఉండే సుజనా చౌదరి ఎపి రాజధాని అంశంలో బిన్నమైన అబిప్రాయం ఉండవచ్చు.కాని ఆయన ఇలా దేశ పౌరుడుగా ఉండడమే అనవసరమని ,రిఫ్యూజీగా వెళ్లిపోతామని అనడం ఏమిటో అర్దం కాదు.

బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావు రాజధానిపై రాష్ట్రమే ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చని చెబుతుంటే సుజనా చౌదరి మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

tags : sujana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info