A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబు బందువులకోసమే అమరావతి-మాజీ స్పీకర్
Share |
September 20 2020, 12:47 am

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు తిరుపతిలో సేవ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరిట యాత్ర చేసే అర్హత లేదని మాజీ స్పీకర్ అగరాల ఈశ్వరరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో జన్మించి, ఇక్కడే రాజకీయంగా పైకి వచ్చిన ఆయన జిల్లాకు ఏమీ చేయలేదని ఆయన అన్నారు.. తన బంధువులు, తన సామాజిక వర్గం కోసమే అమరావతిలో రాజధాని ఏర్పాట్లు చేశారని ఈశ్వరరెడ్డి ఆరోపించారు. ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభివృద్ధి, పాలన వికేంద్రీకణకు పాటుపడుతున్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుంది. జిల్లాకు ఆయన ఏమీ చేశారో ప్రజలకు చెప్పి ఆ తర్వాత యాత్ర చేసుకోవాలి. చంద్రబాబు రాయలసీమలో ఎందుకు రాజధాని ఏర్పాటు చేయలేదని ప్రజలు ప్రశ్నించాలని ఆయన పేర్కొన్నారు.

tags : ap, babu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info