A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ర్యాలీకి అనుమతి నిరాకరణ
Share |
September 19 2020, 11:55 pm

తిరుపతిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆద్వర్యంలో నిర్వహించతలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పండగ సీజన్ లో ర్యాలీలకు అనుమతి ఇస్తే ప్రజలకు ఇబ్బంది అవుతుందని ,అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు తెలిపారు. చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం తిరుపతి వెళుతున్నారు. చంద్రబాబు తిరుపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో పలువురు టిడిపి నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. ఐతేపల్లిలో మాజీ మంత్రి అమరనాధ రెడ్డి, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ,తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్ తదితరులను గృహ నిర్భందంలో ఉంచారు.

tags : ap, rally, chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info