A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దీపికా ..నువ్వు ముంబై లో డాన్స్ చేసుకో
Share |
September 19 2020, 11:58 pm

ప్రముఖ నటి దీపికా పడ్కూనే ని ఉద్దేశించి బిజెపి సీనియర్ నేత ఒకరు చేసిన వ్యాఖ్య విమర్శలకు దారి తీసింది. హింస జరిగిన జెఎన్ యూ కి ఆమె సందర్శించడంపై మద్యప్రదేశ్ శాసనసబలో ప్రతిపక్ష నేత అయిన గోపాల్ బార్గవ్ వ్యాఖ్య చేవారు. దీపిక యూనివర్శిటీ సందర్శనకు వెళ్లడానికి బదులు ముంబై లో డాన్స్ చేసుకోవలసిందని అన్నారు. బాలివుడ్ నటి యూనివర్శిటీకి వెళ్లడం వల్ల అక్కడ పిల్లల చదువులు దెబ్బతింటాయని, అక్కడకు బదులు ఆమె ముంబైలో డాన్స చేసుకుని ఉండాల్సిందని ఆయన అన్నారు.దీపిక రాజకీయాలలో రాదలచుకుంటే నటనకు స్వస్థి చెప్పి రావచ్చని, అంతేకాని, బాదితుల పరామర్శ పేరుతో రాజకీయం చేయవద్దని అన్నారు.అయితే గోపాల్ భార్గవ మహిళలను కించపరిచేలా మాట్లాడతారా అని ఇతర పార్టీలు విమర్శించాయి.

tags : deepika, bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info