A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెటిఆర్ఎస్ ఆలయాల సందర్శన ఆంతర్యం
Share |
September 20 2020, 12:51 am

టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు, మంత్రి కెటిఆర్ కు సడన్ గా భక్తి వచ్చిందా? లేక కొద్దిగా ఉంటే పెరిగిందా? తన తండ్రి సూచన మేరకు ఆయన ఆలయాల సందర్శన చేస్తున్నారా?లేక ఇంకా ఏమైన కారణాలు ఉన్నాయా? అన్న చర్చ జరుగుతోంది. గతంలో ఆయన పెద్దగా గుళ్ల చుట్టూ తిరిగిన సందర్భాలు లేవు. తన తండ్రి, ముఖ్యమంత్రి కెసిఆర్ భక్తిలో అగ్రగణ్యుడు అయినా కెటిఆర్ మాత్రం అంత సీరియస్ గా కనిపించేవారు కారు.తండ్రి యజ్ఞహోమాలు చేసినా, విఐపిలను స్వాగతం చెప్పడం వరకే కెటిఆర్ పరిమితం అయ్యేవారు.కాని ఆయన కుటుంబంతో సహా తిరుమలకు వెళ్లడం కాని, వేముల వాడ ఆలయ దర్శన కాని ఇవన్ని కొత్త పరిణామాలు గా ఉన్నాయి.బక్తి గురించి అడిగితే కొంతకాలం క్రితం తాను ఖర్మను మాత్రమే నమ్ఉతానని అన్నారు. కాని ఇప్పుడు ఆయన ఆలయాలకు టూర్ చేస్తున్నారు. దీనికి కారణం చినజియ్యర్ స్వామి సలహా , తండ్రి సూచన ఉన్నాయని అంటున్నారు. ఈ ఏడాది కెటిఆర్ కు రాజయోగం ఉందని ,అందువల్ల ఆయన ఆలయాలకు వళ్లాలని స్వామీజీ చెప్పారని ఒక పత్రిక రాసింది.

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info