A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రైతులకు ఎందుకు అన్యాయం జరుగుతుంది
Share |
September 19 2020, 11:59 pm

చంద్రబాబు చేస్తోన్న ఉద్యమాలు రైతుల కోసమా.. ఆయన బినామీ ఆస్తులను కాపాడుకోవడం కోసమా అని వ్యవసాయ మిషన్ ఉపాద్యక్షుడు ఎమ్.వి.ఎస్.నాగిరెడ్డి ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని.. రైతు భరోసా పథకాన్ని అమలు చేయడంతో పాటు, తొమ్మిది గంటలు విద్యుత్‌ను అందిస్తున్నారని చెప్పారు.
రాజధాని రైతులకు ఎలాంటి అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు. రాజధాని తరలిస్తామని ఎవ్వరు చెప్పలేదని.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని మాత్రమే చెప్పారన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారని.. ఏ కమిటీలోనూ అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామని చెప్పలేదన్నారు. రైతుల సమస్యలపై చర్చించి పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రైతులు తమ సమస్యలను హై పవర్‌ కమిటీ దృష్టికి తీసుకురావాలని.. ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా రైతులు కు మేలు చేసే విధంగా వైఎస్‌ జగన్‌ పరిపాలన అందిస్తున్నారని నాగిరెడ్డి అన్నారు.

tags : nagireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info