A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జోలె ఎందుకు పడుతున్నావు బాబూ-దాడి ప్రశ్న
Share |
September 20 2020, 12:00 am

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జోలె ఎందుకు పడుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. తండ్రి,కొడుకులు చంద్రబాబు,లోకేష్ లు ఇద్దరూ గత ఐదేళ్లుగా దోచుకున్నది చాలదా అని ఆయన అన్నారు.గతంలో రాజధాని పేరుతో ఇటుకలు అమ్మారని, ఆ తర్వాత విరాళాలు తీసుకున్నారని, ఆ డబ్బు ఏమి చేశారో ఎక్కడా చెప్పలేదని, బడ్జెట్ లో చూపలేదని ఆయన అన్నారు.చంద్రబాబు ఇప్పుడు మళ్లీ జోలె డ్రామా ఆడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో అబివృద్ది వికేంద్రీకరణ లేకపోతే ఎంత నష్టమో చంద్రబాబు తెలుసుకోవాలని ఆయన అన్నారు.విశాఖ ఎక్జిక్యూటివ్ కాపిటల్ అయితే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జగన్ గత ఎనిమిది నెలలుగా ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నారని,నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని, చంద్రబాబు ఎవరికైనా ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు.

tags : dadi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info