A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖ ప్రజలు కూడా అడగలేదు- చంద్రబాబు
Share |
September 19 2020, 11:30 pm

అమరావతి ని రాజదానిగా మార్చమని ఎవరు అడిగారు.విశాఖ ప్రజలు కూడా అడగలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ పిచ్చి తుగ్లక్ మాదిరి మూడు రాజదానులు అని అంటున్నారని ఆయన విమర్శించారు. పోరాటం చేస్తున్నది తన కోసం కాదని.. ప్రజల కోసం.. వారి బిడ్డలు, కుటుంబాల భవిష్యత్‌ కోసమేనని స్పష్టం చేశారు. రాష్ట్రం మొత్తం ఒక్కటి కావాలని పిలుపిచ్చారు. ‘ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, అభివృద్ధి కోసం పని చేయాలి గానీ అధికార వికేంద్రీకరణ ఏమిటి? కర్ణాటక ప్రజలను మీది ఏ రాజధాని అని అడిగితే అని చెబితే బెంగళూరు అని చెబుతారు మనల్ని ఎవరైనా మీ రాజధాని ఏది అని అడిగితే ఏమి చెబుతాం. అమరావతా.. విశాఖా.. కర్నూలా.. లేక పిచ్చి తుగ్లక్‌ అని చెప్పాలా అని చంద్రబాబు అన్నారు. రాజమండ్రి ,తదితర సబలలో ఆయన మాట్లాడారు.

tags : chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info