A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరాన్ని ఈ క్రమంలో పూర్తి చేయండి
Share |
September 19 2020, 11:57 pm

గోదావరి నదిలో వరదలు ప్రారంభమయ్యేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పన.. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పనులను సమన్వయం చేసుకుంటూ పూర్తిచేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు సూచించింది. అప్పుడు వరద వచ్చినా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ మీదుగా దానిని మళ్లించి.. ప్రధాన ఆనకట్ట పనులు ఇబ్బంది లేకుండా చేయవచ్చునని.. 2021 నాటికి ప్రాజెక్టు పూర్తిచేయవచ్చునని సూచించింది. ఇదే కాలపరిమితితో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను యథాతథంగా ఆమోదించింది. ఇందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని తాము కేంద్రాన్ని కోరతామని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు ప్రయత్నాలను చేయాలని పీపీఏ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈఓ) చంద్రశేఖర్‌ అయ్యర్‌ సూచించారు. హైదరాబాద్‌లో గురువారం పీపీఏ సర్వసభ్య సమావేశం జరిగింది.

tags : polavaram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info