A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఓటుకు నోటు తీసుకుంటే- వెంకయ్య హెచ్చరిక
Share |
September 19 2020, 1:15 am

దేశవ్యాప్తంగా పంచాయతీ నుంచి లోక్‌సభ వరకు ఒక వారం వ్యవధిలో ఎన్నికలు నిర్వహించేలా చూస్తే మంచిదని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ఏడాదంతా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో వీటిపైనే పార్టీలు దృష్టి పెట్టడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. జమిలి ఎన్నికలు నిర్వహించడం ద్వారా అక్రమ ధన ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుందన్నారు. ‘రాజకీయాల్లో ధనబలం’అంశంపై ఏర్పాటు చేసిన రెండ్రోజుల సదస్సును వెంకయ్య ప్రారంభించారు.ఓటుకు నోటు తీసుకుంటే ప్రశ్నించే గొంతును కోల్పోతామని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు బస్సు, బీరు, బిర్యానీ అనే త్రీ బీ సర్వసాధారణమై పోయాయని, వీటికి ప్రజలు దూరంగా ఉండాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌పై విశ్వవ్యాప్తంగా గౌరవం ఉందని.. అయితే.. ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యంగా మన దేశాన్ని తీర్చిదిద్దుకోవాలంటే ఎన్నికల్లో, ధన, అంగబలంపై నియంత్రణ అవసరమన్నారు. కోటీశ్వరులే ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితులుంటే.. నిజంగా ప్రజాసేవ చేసే వారికి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉండదన్నారు.

tags : venkayya

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info