A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈనాడు పత్రిక ప్రజలను మభ్య పెడుతోంది
Share |
September 20 2020, 1:17 am

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అసాంఘిక శక్తిగా తయారయ్యారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దాడి వీరభద్రరావు విమర్శించారు. రాజధాని రైతులను చంద్రబాబు కావాలనే రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని అంశంపై ఈనాడు పత్రిక ప్రజలను మభ్య పెడుతోందని తెలిపారు. ఇంకా చంద్రబాబును పట్టుకోని వేలాడటం రామోజీరావు అవసరమా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేయొద్దని రామోజీకి మనవి చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం న్యాయబద్ధంగా వాస్తవాలు రాయాలని కోరారు.

tags : dadi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info