A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు రక్తం మళ్లీ ఉడుకుతోంది
Share |
September 20 2020, 12:06 am

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు మళ్లీ రక్తం ఉడికిపోతోంది.ఆయన ఈ విషయం చెప్పారు. రాజమండ్రి సభలో మాట్లాడుతూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పాలన చూస్తుంటే తన రక్తం మరుగుతోందని అన్నారు.రాజధాని అంటే పేకాటలో మూడు ముక్కలాట అనుకున్నారా? రాజధాని ఎవరైనా గర్వంగా చెబుతారని.. మరి మనమేం చెబుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని మార్చాలని రాష్ట్రంలో ఒక్కరైనా అడిగారా?3 రాజధానులు కావాలని ఎవరైనా అడిగారా అని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ప్రజలంతా కోరుకున్నారన్నారు. ఉపాధి కావాలని రాష్ట్ర యువత కోరుకుంటోందని చెప్పారు. జీవితంలో తొలిసారిగా అమరావతి కోసం జోలె పట్టానన్నారు. విశాఖ, తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరం.. ఇలా అన్ని నగరాలు అభివృద్ధి కావాలని ఆయన అన్నారు.

tags : chandrababu, blood

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info