A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖ వచ్చే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు
Share |
September 20 2020, 12:10 am

ఎపి ప్రభుత్వం విశాఖకు సచివాలయం తరలించాలని యోచిస్తున్న తరుణంలో సచివాలయ ఉద్యోగులకు పలు రాయితీలు ఇవ్వాలని సంకల్పించినట్లు కదనం. మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ దీనిపై చర్చించిందని వార్తలు సూచిస్తున్నాయి. విశాఖ రావడానికి ఇష్టపడే ఉద్యోగులు ఒక్కొక్కరికి 200 గజాల ఇళ్ల స్థలం ఇవ్వాలని ప్రతిపాదించారని చెబుతున్నారు. హెచ్ఆర్ఏ 30 శాతం, 10శాతం సీసీఏ.. ఇంటి సామాన్ల తరలింపు కోసం హోదా బట్టి లక్ష నుంచి 50 వేలు అందజేయాలని భావిస్తున్నారు.
ఉచిత నివాస వసతి, కుటుంబంతో సహా తరలి వస్తే.. నెలకు రూ.4 వేల చొప్పున రాయితీ అద్దె చెల్లించాలని ఆలోచిస్తున్నారు. వారానికి ఐదు రోజుల పనిదినాల కొనసాగింపు... స్థానికత అంశంపై 2024 వరకు గడువు పెంపుదల... అమరావతిలో ఇచ్చినట్టే బస్సు, రైలు ప్రయాణ రాయితీని కొనసాగించాలని , అలాగే ఉద్యోగుల పిల్లలకు విద్యా సంస్థల్లో డొనేషన్లు లేకుండా సీట్లు ఇవ్వాలని తలపెట్టారని అంటున్నారు.

tags : ap, vsp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info