A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మూడు రాజధానులు ముద్దు- ఆయా జిల్లాల్లో ర్యాలీలు
Share |
September 20 2020, 12:11 am

అమరావతి కొన్ని గ్రామాలలో ఒకే రాజధాని ఉండాలని ఆందోళనలు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ఒకే రాజధాని అమరావతి మాత్రమే ఉండాలని యాత్రలు చేస్తుండగా, వివిధ ఇతర జిల్లాలలో మూడు రాజదానులు ముద్దు అంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు జరుగుతున్నాయి. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, తూర్పు గోదావరి తదితర జిల్లాలలో ర్యాలీలు జరిగాయి.ఆయా ర్యాలీలలో వివిధ వర్గాలకు చెందినవారు పాల్గొన్నారు. కొన్ని చోట్ల మంత్రులు ,వైసిపి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ గాజువాక ప్రాంతంలో పాదయాత్ర చేశారు. గాజువాక లో పోటీచేసిన పవన్ కళ్యాణ్ ,ఇప్పుడు విశాఖను వ్యతిరేకించడం ఏమిటని ప్రశ్నించారు.

tags : ap, rally

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info